Header Banner

వారికి వెంటనే పరిహారం ఇవ్వండి! కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

  Tue May 06, 2025 09:15        Politics

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాల కారణంగా రైతులు భారీగా పంట నష్టపోయారు. పిడుగుపాటుకు గురై పది మంది మరణించగా, పశువులు కూడా మృతి చెందాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టంపై నిన్న సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించారు. అలాగే, పిడుగుపాటు కారణంగా మృతి చెందిన పది మంది కుటుంబాలకు తక్షణమే పరిహారం అందజేయాలని తెలిపారు. పిడుగుపాటుకు చనిపోయిన పశువులకు నిబంధనల ప్రకారం సాయం విడుదల చేయాలని ఆదేశించారు.
అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2,224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, 138 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,033 హెక్టార్లు, నంద్యాలలో 641, కాకినాడలో 530, శ్రీసత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు.


ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #CMChandrababu #ImmediateCompensation #CollectorsMeeting #APGovernment #ReliefMeasures #PublicWelfare